ఆంధ్రప్రదేశ్‌కు రూ. 20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
పారదర్శక విధానాలు, పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మనోహర్ వివరించారు. గత వైసీపీ పాలనలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, పారిశ్రామిక వర్గాల్లో మళ్లీ భరోసా నింపడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు.










