రోలుగుంట మండల జి హెచ్ ఆర్ ఏ ఏ చైర్మన్గా బెజవాడ సత్తిబాబు నియామకం

0
1

అనకాపల్లి జిల్లా రోలుగుంట.  ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం GHRAA వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ కాసల కోనయ్య ఆదేశాల మేరకు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి సురేష్ కుమార్, రాష్ట్ర చైర్మన్ బి వి గణేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల చైర్మన్ గా బెజవాడ సత్తిబాబును నియమించడం జరిగింది.ఈ నియామకాన్ని అనకాపల్లి జిల్లా చైర్మన్ గొర్లీ రాఘవులు మరియు జిల్లా అడ్మిన్ గరికిన ఎల్లారావు సహకారంతో అధికారికంగా ప్రకటించారు. నూతనంగా నియమితులైన బెజవాడ సత్తిబాబుకు జిల్లా నాయకత్వం మరియు గ్రూపు సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరియు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.GHRAA అనగా ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం. ఇది మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక అన్యాయాలపై పోరాటం, ప్రజలలో చట్టాలపై అవగాహన కల్పించడం అనే ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తున్న జాతీయ స్థాయి సంస్థ. సమాజంలో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలపై స్పందించి బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సంస్థ వ్యవస్థాపకులు కాసల కోనయ్య నేతృత్వంలో ఇప్పటివరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించింది.

రోలుగుంట మండల బాధ్యతలు చేపట్టిన తర్వాత బెజవాడ సత్తిబాబు మండలంలో ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగితే వెంటనే స్పందించి బాధితులకు న్యాయం అందించే దిశగా పని చేస్తారని జిల్లా నాయకత్వం ఆకాంక్షిస్తోంది. ఆయన నియామకంతో రోలుగుంట మండలంలో GHRAA కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.ఈ సందర్భంగా తిప్పాన రమేష్ బాబు మాట్లాడుతూ నూతన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు.