జగన్ను కలిసిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే

0
1

🔵స్థానిక ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యం

నందిగామ, అక్టోబర్ 8, bharat aawaz :

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని నందిగామ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ప్రముఖ నాయకులు గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో నేతలు జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.

🔵స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు నేతలు తెలిపారు. వార్డు స్థాయి నుంచి ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.

🔵పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం_: _షేక్ సుభాని మేస్త్రి

ఈ సందర్భంగా నందిగామ మైనార్టీ వైఎస్సార్‌సీపీ నేత షేక్ సుభాని మేస్త్రి తదితరులు జగన్‌ను కలిశారు. సుభాని మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ వైసీపీ నేతలు ప్రత్యేక సమావేశం అయ్యారు.