నందవరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ,నందవరం మండలం బిజెపి పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మండల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,మండల రైతులందరికీ కరువు నష్టం వలన నష్ట పోయిన రైతులకు కరువు మండలంగా ప్రకటించి న్యాయం చేయాలని డిమాండు తో ఈ రోజు మన నందవరం మండలం రెవిన్యూ (ఉప )తహసిల్దార్ గారికి , మరియు MPDO గారికి, మండల వ్యవసాయ అధికారులకు బిజెపి పార్టీ నందవరం మండల అధ్యక్షులు, శ్రీ .మఠం రాజశేఖర్ స్వామి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందవరం మండల సీనియర్ నాయకులు గురజాల అయ్యప్ప రెడ్డి గారు మరియు నందవరం మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు హాలహర్వి బోయ భీమయ్య, బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు తిమ్మప్ప, మండల ప్రధాన కార్యదర్శులు గవ్వల నారాయణ, చెంచు మహేష్, బిజెపి నాయకులు భీమన్న, రాజు, రైతులు పాల్గొనడం జరిగింది.










