
సీతారాంపూర్ ఐ వి ఐ లో అంబరాన్నంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు … * తంగేడు, గునుగు వర్ణాల లయబద్ధ అడుగులు… ఆనందోత్సాహాల నడుమ ముందస్తు బతుకమ్మ సంబరాలు… * అమ్మలు, పాపలు, టీచర్ల ఆటాపాటలతో రంగులద్దిన ఐ వి ఐ సి బి ఎస్ ఈ ప్రాంగణం.. కరీంనగర్ (సీతారాంపూర్): ఒక్కేసి పువ్వేసి చందమామ… రెండేసి పువ్వులకూ ఉయ్యాలో! అంటూ సాగిన గజ్జల చప్పుళ్లు, గుబాళించిన తంగేడు, గునుగు, తామర పూల సువాసనలతో సీతారాంపూర్ మైమరిచిపోయింది స్థానిక ఐవి వై (IVY) సీబీఎస్ఈ పాఠశాలలో ‘ముందస్తు బతుకమ్మ వేడుకలు’ శుక్రవారం వర్ణరంజితంగా, మిన్నంటే ఉత్సాహంతో అట్టహాసంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణమంతా ఒక వైపు సంస్కృతి పరిమళాలు, మరోవైపు పండుగ సంతోషాలతో కన్నులపండువగా వికసించింది. వెలిగిన దివ్యజ్యోతి.. ఆధ్యాత్మిక ఆరంభం! ఈ అద్భుత వేడుకకు పాఠశాల చైర్మన్ పసుల మహేష్ , డైరెక్టర్ జయశ్రీ సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి పండుగ సంబరాలను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మహేష్ మాట్లాడుతూ— “ప్రకృతిని దేవతగా ఆరాధించే ఏకైక సంస్కృతి మన తెలంగాణది. పిల్లల్లో సాంస్కృతిక విలువలు, బంధాల తీపిని నింపడానికే ఈ సంబరాలు నిర్వహిస్తున్నాం” అని ఆనందం వ్యక్తం చేశారు. తల్లులు – పిల్లల కోలాటం. లయబద్ధంగా అడుగులు! బామ్మల కాలం నాటి జానపద సొగసులను నేటి తరం పిల్లలకు రుచి చూపిస్తూ అమ్మలు, చిన్నారులు, ఉపాధ్యాయులు చేతులు కలిపారు. రంగురంగుల పట్టువస్త్రాలు ధరించిన చిన్నారులు తీర్చిదిద్దిన బతుకమ్మలను నడుమ ఉంచి, వాటి చుట్టూ తిరుగుతూ లయాత్మకంగా వేసిన కోలాటాలు, పాడిన సంప్రదాయ పాటలు ప్రాంగణాన్ని మార్మోగించాయి. ఆకట్టుకున్న లయలు: టీచర్లు, కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్ సమక్షంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా అడుగులు వేస్తుంటే పాఠశాల మైదానం ఒక సాంస్కృతిక వేదికను తలపించింది. ఆహ్లాదకర వాతావరణం: చిన్నారుల అమాయకపు నవ్వులు, పండగ పాటల కలయికతో తల్లిదండ్రులు సైతం రోజంతా తమ చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందంలో తేలిపోయారు. ఈ ముందస్తు బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, అత్యంత చురుగ్గా పాల్గాన్నారు .