మంగళగిరి పట్టణ వైసీపీ నాయకుడు, మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు (మణి) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వరప్రసాదరావుతో పాటు ఆయన భార్య కృష్ణవేణి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని కోరారు. నియోజకవర్గ పురోభివృద్ధికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.










