నూతన DSPను మర్యాదపూర్వకంగా కలిసిన కట్టా దొరస్వామి నాయుడు.

0
2

మదనపల్లె నూతన DSP B. ప్రసాద్ ని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ TNSV రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా దొరస్వామి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదనపల్లె డివిజన్ పరిధిలోని పలు ముఖ్యమైన అంశాలు, ప్రజా సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలపై DSPతో సౌహార్దపూర్వకంగా చర్చించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తామని కట్టా దొరస్వామి నాయుడు తెలిపారు.