మహాలయ అమావాస్య సందర్భంగా 500 మందికి అన్నదానం

0
1

దాతల సహకారంతో అన్నపూర్ణ సేవాసమితి సేవా కార్యక్రమం

నందిగామ, అక్టోబర్ 10 bharat aawaz : ఆర్యవైశ్య సంఘం, అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం నందిగామ రథం సెంటర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం చేశారు.

పరిశె మల్లికార్జునరావు, రాణి దంపతుల కుమారుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న నోముల మణికుమార్, ఉషశ్రీ దంపతులు, స్వర్గీయ పసుమర్తి కోటేశ్వరరావు, పుష్పావతి స్మారకార్థం వారి కుమారులు పసుమర్తి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు ఆర్థిక సహకారం అందించారు.

అన్నపూర్ణ సేవాసమితి వ్యవస్థాపకులు పారేపల్లి సాయిబాబు మాట్లాడుతూ, మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ అన్నదానం చేయడం విశిష్టమైన సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు.

అన్నదానానికి సహకరించిన పరిశె మల్లికార్జునరావు, రాణి దంపతులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, అన్నపూర్ణ సేవాసమితి సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.