సిద్ధార్థ హైస్కూల్కు విశిష్ట విద్యాప్రదాత అవార్డు

0
2

🟢విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ప్రిన్సిపాల్ విజయలక్ష్మి

నందిగామ అక్టోబర్ 10 bharat aawaz 

నందిగామలోని సిద్ధార్థ హైస్కూల్‌కు విశిష్ట విద్యాప్రదాత అవార్డు లభించింది. విద్యారంగంలో పాఠశాల అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, కరస్పాండెంట్ రామ్మోహన్ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. చదువుతో పాటు నైతిక విలువలు, మంచి నడవడికను అలవర్చుకోవాలని, లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

సిద్ధార్థ హై స్కూల్ కరస్పాండెంట్ రామ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడమే పాఠశాల ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాఠశాలకు అవార్డు లభించడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.