ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చిరాజుపాలెంలోని వీసా (VISA) & జివిఎంసి (GVMC) నిరాశ్రయుల వసతి గృహంలో ఆధార్ నమోదు శిబిరం మరియు వస్త్రాల (చీరల) పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్ నాయుడు (గణబాబు) గారి ఆధ్వర్యంలో, సామాజిక కార్యకర్త శ్రీమతి మమత గారి నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు గుర్తింపు కార్డులు అందించేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంప్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. సమాజంలో ఆదరణ కోల్పోయిన అనాథలు, వృద్ధులు మరియు నిరాశ్రయులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీరికి ఆహారం, వసతితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా గుర్తింపు కార్డులు కల్పించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొమ్మిది రమణ, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఎలమంచిలి అపర్ణ ప్రసాద్, వార్డు అధ్యక్షులు అరుణ్, నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు మరియు వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.










