సింహాచలంలో ఘనంగా ప్రారంభమైన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా నూతన చిత్రం: ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రభుత్వ విప్ గణబాబు

0
0

శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మోహిని మోషన్ పిక్చర్స్ సంయుక్త సమర్పణలో, కె. గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న నూతన చలన చిత్రం ఆదివారం విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘనంగా ప్రారంభమైంది. ‘C/O కంచరపాలెం’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధానంలో, ఆలయ గోపురం ఎదుట నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గౌరవ ప్రభుత్వ విప్ గణబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు తొలి షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ మహా మరియు కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, శ్రవంతి పేపకాయల, పావని కరణం హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె. గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, “సింహాద్రి అప్పన్న స్వామివారి దివ్య ఆశీస్సులతో, గోపురం ఎదుట మా చిత్ర ప్రారంభోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రభుత్వ విప్ గణబాబు గారు విచ్చేసి మా చిత్రాన్ని ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని తెలిపారు.