నస్పూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) SRP 3&3A గని పిట్ కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్‌లోని CCC ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TBGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి పిట్ కమిటీ సభ్యుల కృషి, సహకారం, ఐక్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో యూనియన్ విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో TBGKS సెంట్రల్ కమిటీ సభ్యుడు వెంకటరమణ రెడ్డి, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి తౌటి నరేష్, శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కమిటీ సభ్యులు సాధుల భాస్కర్, ఉత్తేజ్ రెడ్డి, జంగా తిరుపతి రెడ్డి, పానుగంటి వినయ్, షిఫ్ట్ ఇన్‌చార్జిలు బాలసాని రమేష్, మోటపలుకుల గంగాధర్, సునీల్‌తో పాటు పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.










