BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంచిర్యాల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

0
3

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కృషితో మంచిర్యాల జిల్లా ఏర్పాటైందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జిల్లా ఆవిర్భావాన్ని స్మరించుకున్నారు.తదనంతరం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వివిధ వృత్తి సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.