ఉద్యమకారుల దీక్షలు.. 25వ రోజుకు..|

0
3

● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు

● తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్

అల్వాల్, అక్టోబరు 11: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని దీక్షా శిబిరం వేదికగా నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేయకుండా తక్షణమే కార్యాచరణ చేపట్టాలని కోరారు.

ఉద్యమకారుల సేవలను గుర్తించి, వారికి తగిన గౌరవం కల్పించడంతోపాటు సంక్షేమానికి సంబంధించిన విధివిధానాలను త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అర్హులైన ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గురుకులాల జేఏసీ అధ్యక్షుడు మామిడి నారాయణ ఈ రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. 25వ రోజు దీక్షలో బి. పరమేశ్వర్, దీక్ష చేపట్టారు.. 

ఈ కార్యక్రమంలో పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్, ముత్యాలు, అనంతుల సంతోష్, డోలి సుధీర్, అరుణ్ తదితరులు పాల్గొని దీక్షలకు సంఘీభావం తెలిపారు.

#Sidhumaroju

Alwal