మంచిర్యాల : నియోజకవర్గంలోని జంగిల్ సఫారీ ప్రాంతంలో తెలంగాణ అటవీ శాఖ, గ్రీన్‌సెక్యూర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన దేశీయ స్థాయి తొలి ఫారెస్ట్ సఫారీ మారథాన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మకరంద్, అటవీ శాఖ అధికారి రాహుల్ కృష్ణ జాదవ్, డైరెక్టర్ శాంత్ రామ్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన 30 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలను అతిథులు జెండా ఊపి ప్రారంభించారు.అటవీ సంపదను కాపాడటం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మారథాన్‌ను నిర్వహించారు. ప్రకృతితో మమేకమవుతూ వ్యాయామం, పరుగుపందాల ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమం సాగింది.అటవీ సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.










