మోదీ ప్రజాసేవకు 25 ఏళ్లు పూర్తి.|

0
9

● నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం 

● తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా తీర్మానం

అల్వాల్,అక్టోబరు11:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోదీ ప్రజాసేవ ప్రస్థానం, దేశాభివృద్ధికి ఆయన అందిస్తున్న నాయకత్వంపై చర్చించారు.

దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, జాతీయ భద్రత, సంక్షేమ పథకాల అమలులో మోదీ దూరదృష్టిని ఈ సందర్భంగా కొనియాడారు.

ప్రజాసేవలో ఆయన ప్రయాణం, దేశ పురోగతికి చేపట్టిన కార్యక్రమాలు పార్టీ శ్రేణులకు స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సమావేశం తీర్మానించింది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్ ఇంజన్‌ సర్కారు ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత డబుల్ ఇంజన్‌ సర్కారు ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సంకల్పించింది

ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పదాధికారులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal