● కౌకూర్ చిన్నారి హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన మల్కాజిగిరి పోలీసులు
● పది ప్రత్యేక బృందాల గాలింపు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్టు
అల్వాల్,అక్టోబరు12:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కౌకూర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ విషాదకర ఘటనపై పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు.
చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేయాలనే కుట్రలో భాగంగా ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ మీడియా సమావేశంలో తెలిపారు.
నివాస సముదాయాల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసుకోవాలని సిపి సూచించారు.
గృహ సహాయకులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్ల వివరాలను పోలీసుల ద్వారా ధృవీకరించుకోవాలని, ‘మీ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా వారి వివరాలను నమోదు చేయించాలని కోరారు.
‘నేను సైతం 2.0’ కార్యక్రమం ద్వారా అపార్ట్మెంట్లు, కాలనీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.
నేరాల నివారణలో పోలీసులతో కలిసి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతే తమ బాధ్యతని, నేరాల నివారణే తమ లక్ష్యమని మల్కాజిగిరి పోలీసులు స్పష్టం చేశారు.
#Sidhumaroju
Alwal








