భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.. కలెక్టరేట్ వద్ద AIKS ధర్నా!

0
2

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (AIKS) జిల్లా సమితి డిమాండ్ చేసింది.

2026 అక్టోబర్ 12న కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రైతు సంఘం ప్రధాన డిమాండ్లు:

 వరి పంటకు ఎకరాకు ₹30,000 నష్టపరిహారం.

 పత్తి, మిర్చి పంటలకు ఎకరాకు ₹50,000 పరిహారం.

 కూరగాయల పంటలకు ఎకరాకు ₹20,000 పరిహారం.

 ఇతర అపరాల పంటలకు ఎకరాకు ₹40,000 పరిహారం.

 వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా.

 రైతులందరికీ సమగ్ర పంటల బీమా అమలు.

 కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేయడం.

 స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించడం.

 రైతులకు ₹2 లక్షల రుణమాఫీ అమలు చేయడం.

 ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కల్లూరి వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సలిగంటి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వీసంశెట్టి పూర్ణచంద్రరావు తదితర రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.