అడవితల్లి బాట’పై పవన్‌కు చంద్రబాబు అభినందనలు.

0
1

 

రూ.2,052 కోట్లతో ‘అడవితల్లి బాట 2.0’కు శ్రీకారం

1,341 గిరిజన ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం

డోలీ మోతలకు చరమగీతం పాడటమే ఈ కార్యక్రమ లక్ష్యం

ఇది గిరిజనుల కష్టాలకు విముక్తి అని చంద్రబాబు వ్యాఖ్య

గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి, వారి దశాబ్దాల కష్టాలకు చరమగీతం పాడే లక్ష్యంతో రూపొందించిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తన స్పందనను పంచుకున్నారు.

 

‘అడవితల్లి బాట’ తొలి విడత విజయవంతం కావడం, ప్రస్తుతం రెండో దశ ‘అడవితల్లి బాట 2.0’కు శ్రీకారం చుట్టడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ దశలో భాగంగా రూ. 2,052 కోట్ల వ్యయంతో 1,341 గిరిజన ఆవాసాలకు సంబంధించి 1,976 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.