వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం: పవన్ కల్యాణ్.

0
2

వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం. మేం అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూస్తున్నాం. ఏ పార్టీ బతకాలనేది కాదు, వ్యవస్థలు బతకాలి, గ్రామాలు బాగుపడాలి, ప్రజల జీవితాలు మెరుగుపడాలి. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత, వైసీపీ మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా అవసరమైన నిధులు అందేలా చర్యలు తీసుకున్నాను” అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడ గ్రామంలో “అడవితల్లి బాట 2.0” కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తాము బాధ్యతలు స్వీకరించాక వైసీపీ మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా నిధులు విడుదల చేశామని, తమకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు.