● వీధి దీపాల ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి
● గంగపుత్ర కాలనీ కమ్యూనిటీ హాల్, బీహెచ్ఈఎల్ కాలనీ రోడ్డు పనులపై దృష్టికి తెచ్చిన మాజీ కార్పొరేటర్
● సద్దుల బతుకమ్మకు చిన్నరాయుని చెరువు వద్ద తాత్కాలిక ఘాట్ ఏర్పాటు చేయాలని అభ్యర్థన
అల్వాల్, అక్టోబరు 12:అల్వాల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి డీసీ భోగేశ్వర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సాజిద్, మహేందర్, శోభన్, బాలయ్య ఆమె వెంట ఉన్నారు.
పెండింగ్‌లో ఉన్న వీధి దీపాల ఫిర్యాదులపై స్పందించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారికి వివరించారు.
గంగపుత్ర కాలనీలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, బీహెచ్ఈఎల్ కాలనీలో నిలిచిపోయిన రహదారి పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
సద్దుల బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో చిన్నరాయుని చెరువు వద్ద తాత్కాలిక బతుకమ్మ ఘాట్‌ను సిద్ధం చేయాలని కోరారు.
మహిళలు పండుగ వేడుకలను సౌకర్యవంతంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణ రూపొందించాలని శాంతి శ్రీనివాస్ రెడ్డి డీసీ దృష్టికి తీసుకెళ్లారు.
#Sidhumaroju
Alwal










