గుండెపుడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

0
1

గుండెపుడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి – మాలోత్ మంగీలాల్

జూలూరుపాడు: వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ ప్రారంభించారు.

వైరా శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దుద్దుకూరి సుమంత్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాలోత్ మంగీలాల్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. గుండెపుడి గ్రామంలో ఈ రోజు నుంచి ఓటరు నమోదు కేంద్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాదె కృష్ణయ్య, భూక్యా నర్సింహారావు, అనంతారం సర్పంచ్ కోర్స రమేష్, చిలుకూరి శ్రీను, జవ్వాది వీరయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.