అర్నబ్ తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్లను వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకోవాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఈ రోజు, రేపు ప్రతి ఒక్కరూ తమ డీపీ, స్టేటస్లు, గ్రూపుల్లో ఈ నంబర్లను షేర్ చేసి తుపాన్ బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు.
ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లు:
– మనమిత్ర వాట్సాప్: 9552300009
– అత్యవసర సేవలు: 112
– విపత్తు నిర్వహణ: 1070
– టోల్‌ఫ్రీ నంబర్: 18004250101
ఆపద సమయంలో ఈ నంబర్లు ప్రజలకు త్వరగా చేరితే సకాలంలో సహాయం పొందే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా స్వచ్ఛంద ప్రచారం మాత్రమేనని, అధికారికంగా ధ్రువీకరించిన నంబర్లనే షేర్ చేయాలని సూచిస్తున్నారు.
మన చిన్న ప్రయత్నం.. ఆపదలో ఉన్నవారికి పెద్ద సహాయం!










