తెనాలికి చెందిన ప్రముఖ గుండె వైద్యుడు డాక్టర్. పాటిబండ్ల దక్షిణామూర్తి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో లేని సమయంలోనూ గుండెపోటుకు గురైన వేలాదిమంది పేషెంట్లకు ప్రాణoపోసి ఆయన గొప్ప వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి తెనాలి వైద్య రంగానికి తీరని లోటు. బుధవారం అంతక్రియలు నిర్వహించనున్నారు.










