శ్రీరాంపూర్‌లో ఈ నెల 28న ఖేలో ఇండియా ఆస్మిత రగ్బీ సిటీ ప్రోగ్రాం నిర్వహణ

0
3

శ్రీరాంపూర్: శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో ఈ నెల 28న ఖేలో ఇండియా ఆస్మిత రగ్బీ అండర్‌–15 పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఆవునూరి మహేష్ తెలిపారు.యువ క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, రగ్బీ క్రీడలో ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్‌–15 విభాగంలో జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన కోరారు.క్రీడల అభివృద్ధికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని మహేష్ తెలిపారు.