🔹ఊటుకూరు అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
వింజమూరు మండలం, ఊటుకూరు సెగ్మెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ఊటుకూరు సెగ్మెంట్ ఎంపీటీసీ స్థానానికి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ కందికట్టు రత్తయ్య గారికి, వింజమూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ గణపం సుదర్శన్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి, అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు. ఊటుకూరు సెగ్మెంట్ పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు పేర్కొన్నారు.










