తెనాలి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు స్థానిక వి ఎస్ ఆర్ అండ్ ఎన్ వి ఆర్ కళాశాలలో ప్రారంభం కానున్నాయి.ఇందుకోసం 52 కౌంటర్లు,104 టేబుల్సు ఏర్పాటు చేశారు. 91, 270 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క కౌన్సిలర్ చైర్మన్ అభ్యర్థి తరపున ఒక్కో ఏజెంట్ కు అనుమతి ఇస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ఒక్క బూతు కౌంటింగ్ ఒక్క రౌండ్ లో అవుతుంది. ఉదయం 11 గంటల సమయానికి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.










