🏏 పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు సన్నాహాలు
● 21 జట్లతో టీ20 క్రికెట్ టోర్నమెంట్
● నవంబర్ 17 నుంచి 19 వరకు పోటీలు
అల్వాల్, నవంబర్ 2: 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో భాగంగా నిర్వహించనున్న క్లస్టర్-బి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లపై ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అధికారులు సమీక్ష నిర్వహించారు.
నవంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 21 జట్లు పాల్గొననున్నాయి.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపీఎస్ ఆదేశాల మేరకు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
కార్ అడ్మిన్ ఆర్ఐ శ్రీనివాస్ మైదానాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్ల వివరాలను వివరించారు.
టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ బాధ్యతలతో పది కమిటీలను ఏర్పాటు చేశారు. సమన్వయంతో పనిచేస్తూ పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సమావేశంలో జోనల్ డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










