🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు (జనకాపూర్) లో ఎదురవుతున్న తాగునీటి సమస్య పరిష్కారానికి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వార్డు పరిధిలో నిలిచిపోయిన నీటి మోటార్ మరమ్మత్తు పనులను ఆయన మున్సిపల్ సిబ్బంది సహకారంతో దగ్గరుండి పర్యవేక్షించి, వేగంగా పూర్తి చేయిస్తున్నారు.
నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన కౌన్సిలర్, వెంటనే స్పందించి ఈ మరమ్మత్తు పనులను చేపట్టారు. వార్డు ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు మున్సిపల్ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఈ మరమ్మత్తు పనులు చురుగ్గా సాగుతున్నాయి.










