జై పల్లెదవాఖాన యన్ ఆరాళ్ళ మందిర్PA..
భరత్ ఆవాజ్ న్యూస్ – నవంబర్-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలోని పల్లె దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ పృథ్వీరాజ్ డిప్యూటేషను వెంటనే రద్దు చేసి, ఆయన రెగ్యులర్‌గా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ మోడెం శ్రీలత అధికారులను కోరారు. గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన గ్రామ సర్పంచ్‌కు డాక్టర్ విధుల్లో లేకపోవడం, గత కొద్ది రోజులుగా విధులకు హాజరు కావడం లేదని తెలిసింది. అంతేకాకుండా ఆసుపత్రిలో గడువు ముగిసిన మందులు (ఎక్స్పైరీ మందులు) ఉండటాన్ని గుర్తించారు. గత కొంతకాలంగా డాక్టర్ పృథ్వీరాజ్ విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య సేవలు అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పల్లె దవాఖానాలో సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదని, కనీసం బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల (డీఎంహెచ్) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన రాలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి వెంటనే స్పందించి తిమ్మంపేట పల్లె దవాఖానాకు వైద్యుడు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, డాక్టర్ డిప్యూటేషన్ ను రద్దు చేసి గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సర్పంచ్ మోడెం శ్రీలత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నాయకులు భూమా అశోక్, కడారి సురేష్, రాజ్ కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు: మోడెం శ్రీలత గ్రామ సర్పంచ్, తిమ్మంపేట.. దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము










