హోటల్ గదిలో అమెరికా పౌరుడి మృతి.. కలకలం.|

0
2

● వ్యాపార పనులపై హైదరాబాద్‌కు వచ్చిన కాలిఫోర్నియా వాసి

● 12వ అంతస్తులోని గదిలో విగతజీవిగా గుర్తింపు

● మృతికి కారణాలపై పోలీసుల దర్యాప్తు

అల్వాల్, నవంబర్ 7: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినస్‌లో ఉన్న మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) వ్యాపార పనుల నిమిత్తం నవంబర్ 2న తన వ్యాపార భాగస్వామి డేవిడ్ వూతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరూ హోటల్‌లో వేర్వేరు గదుల్లో బస చేశారు.

హోటల్‌లోని 12వ అంతస్తులో 1218వ గదిలో ఉంటున్న మిచెల్ బ్రియాన్ లీ నవంబర్ 4 సాయంత్రం నుంచి ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. 

దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది నవంబర్ 5న సాయంత్రం 6.30 గంటల సమయంలో మాస్టర్ కీతో గది తలుపులు తెరిచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడికానున్నాయి.

#Sidhumaroju

Alwal