సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. దుద్యాల మండలం హకీంపేటలో నిర్వహిస్తున్న మెగా రైతు మేళా-ఇండస్ట్రియల్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం రైతులు స్థానికంగా పండించిన పంటలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, సాగుపై వివరాలు తెలుసుకున్నారు. ఎక్స్పోలో పలు వ్యవసాయ ఉత్పత్తులు, ప్రదర్శన ఏర్పాట్లు ఉండటంతో రైతులు, స్థానిక ప్రజలతో పాటు సందర్శకులలో ఆసక్తి పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగ ప్రోత్సాహం, ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. తర్వాత సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎక్స్పోలో పాల్గొన్న రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతు అంశాలపై ఆయన మాట్లాడారు.










