ఇందూరు నగరంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పథ సంచలన్

0
6

నిజామాబాద్ నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పథ సంచలన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే   ధన్‌పాల్ సూర్యనారాయణ     పాల్గొని స్వయంసేవకులతో కలిసి పథ సంచలన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో క్రమశిక్షణతో సాగిన పథ సంచలన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘ్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.