చిట్లూరి వీరభద్రరావు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రగాఢ సంతాపం

0
1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్: సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు చిట్లూరి వీరభద్రరావు (భద్రరావు) ఆకస్మిక మృతి పట్ల కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రరావు గారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన సమయంలో విద్యారంగానికి విశేష సేవలందించారని, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. తాను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పాఠశాల అభివృద్ధి కోసం పలుమార్లు తనను సంప్రదించి పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

 

ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు, సుజాతనగర్ మండల ప్రజలకు, విద్యార్థి లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. భద్రరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.