నిజామాబాద్ జిల్లా బోధన్ బైపాస్ రోడ్డులో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన బియ్యం లోడ్ లారీ రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది.
అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు. అయితే హోటల్ సమీపంలో పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.










