పెద్దపల్లి: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం పంపించారు. ఈ కార్యక్రమంలో భూ సమస్య, గృహజ్యోతి విద్యుత్ రాయితీ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు తదితర అంశాలపై దరఖాస్తులు అందాయి.కార్యక్రమంలో కలెక్టరేట్ హెచ్ విభాగం పర్యవేక్షకులు ఈశ్వర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.










