సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇంతటి అద్దెలు ఎలా భరించాలి?
ఆదాయం పెరగకపోయినా ఇంటి అద్దెలు మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి?
పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపశమనం కలగాలా? లేక అద్దెల భారం పెరగాలా?
అద్దెల విషయంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధానం అవసరం లేదా?
ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చివరిగా ఒక్క ప్రశ్న.. అభివృద్ధి చెందుతున్న ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో సామాన్యుడు సొంత ఇంట్లో కాకపోయినా అద్దె ఇంట్లోనైనా ప్రశాంతంగా జీవించగలడా?
భారత్ ఆవాజ్ – ప్రజల గొంతుక.. ప్రజా సమస్యల ప్రతిధ్వని!










