జూలూరుపాడు సాయి ఎక్సలెంట్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
జూలూరుపాడు: మండలంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ, భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగలక్ష్మి, నబీనా, ప్రశాంతి, సత్యవతి, కళ్యాణి, అరుణ, భార్గవి, స్వాతి, అనిత, రిచిత, కృష్ణవేణి, జమున, మమత, రజిత, హరిత, డి.రిచిత, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










