ఆదివాసీల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. బహిరంగ సభను ఆపే దమ్ముందా తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ సవాల్

0
2

🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా (భారత్ ఆవాజ్ న్యూస్): ఆదివాసీల గొప్ప చరిత్రను పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ హితవు పలికారు. హైదరాబాద్‌లో తలపెట్టిన ఆదివాసీ బహిరంగ సభను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దమ్ముంటే ఈ సభను అడ్డుకోవాలని ఆయన సవాల్ విసిరారు.

శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఆదివాసీల హక్కుల కోసం తమ పోరాటం పూర్తిగా రాజ్యాంగబద్ధంగా సాగుతోందని తెలిపారు. ఆదివాసీ ఆరాధ్య దైవం కుమురం భీమ్ జయంతికి ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించాలని కోరడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

ఆదివాసీలను బెదిరించే ధోరణిని మానుకోవాలని, సమాజంలో అందరూ సామరస్యంగా మెలగాలని కోట్నాక విజయ్ సూచించారు.