క్రీడల్లో ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ ఎంజేపీ పాఠశాల విద్యార్థినుల ప్రతిభ. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం

0
3

ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: ఆదిలాబాద్‌లో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే (MJP) గురుకుల పాఠశాల బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడాంశాల్లో సత్తా చాటి పాఠశాలకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించి పెట్టారు.

ఈ పోటీల్లో భాగంగా కబడ్డీ, పరుగు పందెం, డిస్కస్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి విజేతలుగా నిలిచారు. క్రీడల్లో రాణించి పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన విద్యార్థినులను ఆర్‌సీఓ (RCO) శ్రీధర్, పాఠశాల ప్రిన్సిపల్ రత్నాబాయి మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.