మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి సీపీఎం డిమాండ్

0
2

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో అమాయక గిరిజనులను దోచుకుంటున్న మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో భూమి పట్టా మార్పిడి మరియు భూమి వారసత్వ హక్కుల కోసం వచ్చే గిరిజనుల నుండి కొంతమంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అధిక మొత్తంలో ఫీజులు, ఛార్జీల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై తహశీల్దార్ కార్యాలయ అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్న మీ సేవ కేంద్రాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం తరపున డిమాండ్ చేశారు.