చింతూరు మన్యంలో ఘోర రోడ్డు ప్రమాదం!

0
1

పోలవరం జిల్లా చింతూరు మన్యంలో ఘోర ప్రమాదం జరిగింది.లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతూరు ఏజెన్సీలోని విఆర్ పురం మండలం చింతరేవుపల్లి గ్రామానికి చెందిన ముత్యాల రాజ్ కుమార్ (22) ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో మూలమలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముత్యాల రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. చింతరేపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు మోతుగూడెం సమీపంలోని పొన్నూరు దారాలమ్మ గుడి కి వెళుతున్నారు. ఈ క్రమంలో రేవు దుర్గాప్రసాద్, ముత్యాల రాజ్ కుమార్లు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనం మీద మోతుగూడెం వైపు వెళ్తుండగా రాజమండ్రి వైపు నుండి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్ కుమార్ తల నజ్ నుజ్జు కాక అదృష్టవశాత్తు దుర్గాప్రసాద్ ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

# Yadagiri