మందస సర్పంచ్ అభ్యర్థిగా సిందిరి జగన్ పేరు ఖరారు
మందస: మందస మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిందిరి జగన్ పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారికంగా ప్రకటించారు.
సోమవారం మందసలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అనంతరం మందస మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిందిరి జగన్ పేరును సీదిరి అప్పలరాజు వెల్లడించారు.
ఈ సమావేశంలో మందస మండల పార్టీ అధ్యక్షుడితో పాటు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










