39వ డివిజన్‌లో పేరుకుపోయిన చెత్త.. పట్టించుకోని అధికారులు!

0
3

నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్‌లో కాలువల నుంచి తొలగించిన చెత్తను రోడ్డు పక్కనే వదిలేయడంతో పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంది. చెత్త తొలగించకుండా రోజుల తరబడి అలాగే వదిలేయడంతో దుర్వాసన వెదజల్లుతూ స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పేరుకుపోయిన చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.