తెనాలి పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై తెనాలి ఎంపీడీవో పరిశీలన

0
4

తెనాలి మండలంలో 2026 రెండవ విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. ఎన్నికల ఏర్పాట్లపై ఎంపీడీవో అత్తోట దీప్తి క్షేత్రస్థాయిలో పర్యటించారు.పోలింగ్ బూతులలో ఓటర్లకు కల్పించే మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఓటర్ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసి వెళ్లే వరకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని సూచించారు.