● ప్రతి ఏటా నవంబర్ 16న అధికారికంగా వేడుకలు
● జీవో ఎంఎస్ నంబర్ 243 విడుదల చేసిన ప్రభుత్వం
● వేడుకల నిర్వహణ బాధ్యతలు YAT&C శాఖకు అప్పగింత
అల్వాల్, నవంబర్ 16: ఈనాడు గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా నవంబర్ 16న అధికారికంగా రాష్ట్ర పండుగగా వేడుకలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 243 జారీ చేసింది.
రామోజీరావు జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తమకు కేటాయించిన బడ్జెట్ నుంచి నిధులు వెచ్చించి వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది.
ప్రతి ఏటా ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ (YAT&C)కు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగు పత్రికారంగంతో పాటు చలనచిత్ర పరిశ్రమకు, రాష్ట్ర అభివృద్ధికి రామోజీరావు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
#Sidhumaroju
Alwal









