ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ గారిని, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాన కార్యదర్శులు శ్రీ అరిగేల మల్లికార్జున్, శ్రీ కోవ విజయ్ కుమార్ గార్లు ఆదిలాబాద్‌లోని ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ గారిని వారు శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని, జిల్లాకు మరిన్ని అభివృద్ధి పనులు మరియు నిధులు కేటాయించేలా చొరవ చూపాలని ఎంపీ గారికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎంపీ గోడం నగేష్ గారు సానుకూలంగా స్పందించి, జిల్లా అభివృద్ధికి మరియు నిధుల మంజూరుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు పెర్గోన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ వెంకట్ నాయక్, కెరమెరి మండల అధ్యక్షులు సేడ్మాకి తుకారాం, సిర్పూర్ (యు) మండల అధ్యక్షులు మర్సుకోల మాణిక్ రావు, కెరమెరి మండల ఉపాధ్యక్షులు పవార్ రవీందర్, నాయకులు రాజ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.









