ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్): జిల్లా కేంద్రంలోని సెయింట్ జోయెల్స్ ఉన్నత పాఠశాలలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ (రహదారి భద్రత అవగాహన కార్యక్రమం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) శ్రీ సంజయ్ కుమార్ హాజరై విద్యార్థులకు రహదారి భద్రతపై పలు కీలక అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అలాగే వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడకూడదని, మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు జ్యోతి, అహఫాజ్, విలియం, విల్సన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









