భూపాలపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
భరత్ అవాజ్ న్యూస్ :జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో బాపు (60) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎడమ కన్ను బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శ్వేత ఘటనాస్థలికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పైలట్ ప్రణీత్ కుమార్ హుటాహుటిన భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము









