వడ్డీప సర్పంచ్ అభ్యర్థిగా ఉడతపల్లి అప్పారావు నామినేషన్

0
3

 రోలుగుంట మండలం వడ్డిప గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన ఉడతపల్లి అప్పారావు బుచ్చంపేట సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పది వార్డుల అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు.అప్పారావు తండ్రి ఉడతపల్లి చంద్రయ్య గతంలో వడ్డిప సర్పంచిగా పనిచేశారు. భారీ ర్యాలీతో గ్రామ ప్రజలు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని అప్పారావు తెలిపారు.